పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” కోసం కలం పట్టిన విషయం తెలిసిందే. పవన్ సొంతంగా సర్థార్ స్క్రిప్టు వర్క్ చేశాడు. తీరా ‘సర్థార్’ రిలీజై ప్లాప్ సినిమాగా తేలింది. సర్థార్ – గబ్బర్ సింగ్ పరాజయానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని సినీ విమర్శకులు ఆరోపించారు. ఇప్పుడు మరోసారి పవన్ కలం పట్టాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి స్క్రిప్టుని రెడీ చేసే పనిలో పడ్డాడు పవన్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నాడు. ఇదో ఫ్యాక్షనిస్టు ప్రేమకథ అని చెబుతున్నారు. టైటిల్ ‘కడప కింగ్’ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కూడా పవన్ స్క్రిప్టు అందించడంతో.. సెట్స్ పైకి వెళ్లక ముందే సెంటిమెంట్ పరంగా.. ఈ సినిమా కూడా ప్లాప్ అనే స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పుడీ న్యూస్ పవన్ ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. మరికొందరు మాత్రం ఈసారి పవన్ స్క్రిప్ట్ కి పదనుపెడుతున్నాడు. ఈసారి పవన్ స్క్రిప్టు, సినిమా రెండూ హిట్టే అని చెప్పుకొంటున్నారు. చివరికి పవన్ సినిమా ఫలితం ఏమొస్తుందో చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి