ఎన్టీఆర్, తమన్నాలపై దేవి దుమ్ములేపే ఐటెం.. ఫ్యాన్స్‌కి పండగే!




రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడంటే ఆ సినిమా స‌గం విజ‌యం ఖాయం అనే భావ‌న ఉంది. ఇక దేవి అందించే పాట‌ల‌న్ని ఒక ఎత్తు అయితే…ఐటెం సాంగ్ మ‌రో ఎత్తు. ఇప్ప‌టికే చాలా సినిమాల‌లో ఐటెం సాంగ్ ల‌ను ఇర‌గ‌దీశాడు. తాజాగా ఆయ‌న సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా జ‌న‌తాగ్యారేజ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం కూడా ఓ అదిరిపోయే బీట్ తో ఐటెం సాంగ్ ని ఇచ్చాడని తెలుస్తోంది. కొత్త టైప్ సౌండ్ ట్రాక్ తో డీఎస్పీ ఇచ్చిన బీట్ విన్న యంగ్ టైర్ ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివ విపరీతంగా ఎగ్జైట్ అయ్యారట. తమ సినిమాలో ఈ మ్యూజిక్ ని కచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిందే అనే రేంజ్ లో డీఎస్పీ మరిపించేశాడని అంటున్నారు. ఈ ఐటెం సాంగ్ లో ఎన్టీఆర్..మిల్కీబ్యూటీ త‌మ‌న్నాతో చిందులేయ‌నున్నాడ‌ట‌.

గ‌తంలో ఎన్టీఆర్‌తో త‌మ్మూ ఊస‌ర‌వెల్లి సినిమాలో ఆన్‌స్ర్కీన్ రొమాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా గ్యారేజ్‌లో మ‌రోసారి ఆడిపాడేందుకు రెడీ అవుతోంది. గ‌తంలో అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ తో అలరించిన ఈ బ్యూటి ఇప్పుడు జనతా గ్యారేజ్ కు మరింత గ్లామర్ యాడ్ చేయనుంది.

కామెంట్‌లు