3 మిలియన్ డాలర్ల ఫై కన్నేసిన ఎన్టీఆర్ !



ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్ తో సినిమా కు భారీగా అంచనాలు పెంచిసిన ఎన్టీఆర్ , ఇప్పుడు ప్రీమియర్ షోల విషయంలో అంచనాలు పెంచేస్తున్నాడు. సెప్టెంబర్ 1 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 31 న అత్యధిక థియేటర్స్ లలో ప్రీమియర్ షో లు వేసి రికార్డ్స్ బ్రేక్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు.

ఓవర్సీస్ లలో టెంపర్ తో 1 మిలియన్ , నాన్నకు ప్రేమతో 2.5 మిలియన్ మార్క్ కొట్టేసిన ఎన్టీఆర్ , జనతా తో 3 మిలియన్ డాలర్ల ను అధిగమించాలని చూస్తున్నాడట. యూఎస్ డిస్ట్రిబ్యూటర్ల సైతం ఎన్టీఆర్ ఆ మార్క్ దాటేస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారట. తెలుగు , తమిళ్ , మలయాళం భాషలలో రిలీజ్ కాబోతుండడం తో ఓవర్సీస్ కలెక్షన్స్ ఇప్పటివరకు ఎన్టీఆర్ చిత్రాలు వసూళ్లు చేసినవాటికి రెట్టింపు ఉంటాయని చెపుతున్నారు. మరి ఎన్టీఆర్ ఏ మేరకు వసూళ్లు సాధిస్తాడా చూడాలి.


కామెంట్‌లు