30, ఆగస్టు 2016, మంగళవారం

జనతా గ్యారేజ్ లో కాంపిటీషన్ లేదు



ఇప్పటివరకు అందరూ ''జనతా గ్యారేజ్'' సినిమాతో ఇతర సినిమాలేవైనా కాంపిటీట్ అవుతాయా అనే విషయాన్ని మాత్రమే చూస్తున్నారు. కాకపోతే ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉంది. అదంతా చూస్తుంటే.. ఒకరికి ఒకరు చాలా కాంపిటీటివ్ అయిపోయే ఛాన్సుంది. ఇలాంటి విషయాల గురించి జనతా టీమ్ అయిన ఎన్టీఆర్.. కొరటాల శివ.. సమంత.. ఏమంటున్నారంటే..

''దొరికిన పాత్రలో పెర్ఫామ్ చేయడానికి బోలెడంత స్కోప్ ఉన్నప్పుడు.. ఇక ఒకరికి ఒకరు మధ్యన కాంపిటీషన్ ఏముంటుంది? మోహన్ లాల్ గారు కంప్లీట్ యాక్టర్ మాత్రమే కాదు.. కంప్లీట్ హ్యుమన్ బీయింగ్ కూడా. ఉన్నదాంట్లో తృప్తి పొందడంలో ఆయన చాలా హ్యాపీ మ్యాన్. అలాగే ఇతర యాక్టర్లందరూ కూడా.. ఎవరికివారు ఇరగదీశారు'' అన్నాడు ఎన్టీఆర్. ఇంతకీ సినిమాలో అసలు ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ క్యాస్టింగ్ ఎలా జరిగింది? ఈ ప్రశ్నకు కొరటాల శివ సమాధానం చెప్పాడు. ''నేను కథ రాసేటప్పుడే ఇది ఎన్టీఆర్ కు అనుకున్నాను. అలాగే మోహన్ లాల్ పాత్రకు కూడా ఆయన్నే అనుకుని రాశాను. కొచిన్ వెళ్ళి కథ చెప్పగానే ఆయన ఓకే చేశారు. అసలు ఈ రెండు క్యారక్టర్లకూ వేరే ఆల్టర్నేటివ్ అనుకోలేదు'' అంటున్నారు కొరటాల. 

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ టైములో.. ఎన్టీఆర్ మోహన్ లాల్ ను 'లాలెటన్' అని పిలిస్తే.. ఆయనేమో మనోడిని 'అన్నా' అని పిలిచేవారట. ఇదే నాకు అతి పెద్ద షాకింగ్ థింగ్ అంటున్నాడు కొరటాల. సెప్టెంబర్ 1న ''జనతా గ్యారేజ్'' సినిమా ధియేటర్లలోకి వస్తోంది. 


లేబుళ్లు: , ,

25, ఆగస్టు 2016, గురువారం

ఎన్టీఆరూ.. ఇప్పుడు చూపించు నీ ప్రతాపం



ఎన్టీఆర్ మంచి నటుడు అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ ఆరంభంలోనే తనేంటో చూపించాడు. తాజాగా టెంపర్.. నాన్నకు ప్రేమతో సినిమాలతో అందరి నుంచి అభినందనలు అందుకున్నాడు. ఐతే ఇన్నాళ్లు ఎన్టీఆర్ చేసిందంతా ఒక ఎత్తు. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’లో చేయబోయేది ఒక ఎత్తు. ఎందుకంటే ఈ సినిమాలో మోహన్ లాల్ ఉన్నాడు.

మోహన్ లాల్ ‘కంప్లీట్ యాక్టర్’ అని దేశమంతా ఒప్పుకుంది. ఆ మాటే ఆయనకు బిరుదుగా మారిపోయింది. తెలుగులో ఏ నటుడూ నచ్చడనే సురేష్ బాబు సైతం తనకు మోహన్ లాల్ అంటే మాత్రం చచ్చేంత ఇష్టం అంటారు. అదీ మోహన్ లాల్ స్థాయి. తెరమీద మోహన్ లాల్ ఉంటే.. మిగతా నటులందరూ పక్కకు వెళ్లిపోవాల్సిందే. తన నటనతో అంతగా హైలైట్ అవుతాడు మోహన్ లాల్. మరి అలాంటి నటుడి ముందు ఎన్టీఆర్ ఎలా పెర్ఫామ్ చేస్తాడు. ఆయనకు ఎలాంటి పోటీ ఇస్తాడు.. నటనలో ఆయన ముందు తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటాడు అన్నది ఆసక్తికరం.

గతంలో మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడితో కలిసి ‘యమదొంగ’లో తెరను పంచుకున్న ఎన్టీఆర్.. ఆయనకు దీటుగా నటించాడు. యమలోకపు సన్నివేశాల్లో అదరగొట్టి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మోహన్ లాల్ ను ఢీకొట్టబోతున్నాడు తారక్. సినిమాలో లాల్ పాత్ర చాలా బలంగా ఉంటుందని.. దానికి చాలానే ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. మరి అలాంటి బలమైన పాత్రలో మోహన్ లాల్ ఎలా నటించి ఉంటాడో అంచనా వేయొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన ప్రత్యేకతను చాటుకున్నాడంటే.. నటనలో అతడికి తిరుగులేదని అందరూ అంగీకరిస్తారు.


లేబుళ్లు: , ,