‘ జనతా గ్యారేజ్ ‘ ప్రీమియర్ షో కోసం వెయిట్ చేస్తున్న స్టార్స్..?



ఇప్పుడు ఎక్కడ చూసిన , ఏ నోటా విన్న ఒకే ఒక మాట అదే జనతా గ్యారేజ్…జనతా గ్యారేజ్..జనతా గ్యారేజ్. అసలు ఈ జనతా గ్యారేజ్ లో ఏముంది అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. కేవలం ఎన్టీఆర్ అభిమానులే కాదు తెలుగు , తమిళ , మలయాళ ఇండస్ట్రీ లోని అగ్ర హీరోలు సైతం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ లోని యాంగ్ హీరోలు ఈ చిత్ర ప్రీమియర్ షో కోసం జనతా టీం తో మాట్లాడడం ఆసక్తిగా మారింది. సెప్టెంబర్ 1 న రిలీజ్ అవుతుండగా ఓ రోజు ముందు అంటే ఆగస్ట్ 31 నాడే ఈ ప్రీమియర్ షో హైదరాబాద్, ఓవర్సీస్ లలో వేయబోతున్నారు. వరుస హిట్స్ తో ఎన్టీఆర్ జోష్ మీద ఉండడం , అలాగే శ్రీమంతుడు చిత్రం తో అందరి చూపు తన ఫై పడేలా మార్క్ సంపాదించుకున్న కొరటాల ఈ చిత్రానికి దర్శకత్వం కావడం తో ఇంకాస్త ఈ సినిమా ఫై అంచనాలు పెంచుకున్నారు.

ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ చిత్ర ప్రీమియర్ షో ను మెగా హీరోలతో పాటు కళ్యాణ్ రామ్ , రాజీవ్ కనకాల , రోలర్ రఘు , వివి వినాయక్ , సుకుమార్ , దిల్ రాజు, దేవి శ్రీ లతో పాటు చిత్రం లో నటించిన నటి నటులు కూడా ఈ షో కు రాబోతున్నారని తెలుస్తుంది.


కామెంట్‌లు