జయహో జనతా.... గ్యారేజ్‌కి రికార్డుల పంట..
విక్రమ్ సినిమా ‘ఇంకొక్కడు’… గ్యారేజ్ సునామీని అడ్డుకుంటుందని చాలా మంది భావించారు. కానీ ఆ ఇంకొక్కడు కాస్తా డిజాస్టర్ అయి కూర్చుంది. ఇక మరోవారం వరకూ వచ్చే పెద్ద సినిమా ఏదీ లేదు. నారా రోహిత్ లాంటి హీరోల సినిమాలు హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్‌ని అడ్డుకునే స్థాయిలో ఉండవు అన్నది వాస్తవం. కానీ ఇప్పుడు ఏకంగా 100 కోట్ల గ్రాస్ లోనే చేరిపోయింది. దీంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇండియాలోను, ఓవరీస్ లో కూడా జయహో జనతా అంటున్నారు. ఓవర్సీస్ మార్కెట్ లో ఎన్టీఆర్దే పై చేయి అని అంటారు. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో… అమెరికాలో 2 మిలియన్ డాలర్లు వసూలు చేయగా జనతా గ్యారేజ్ ఇప్పటి వరకు 1.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. మరో మూడు రోజుల్లో 2 మిలియన్ డాలర్లను దాటబోతుంది . దీంతో ఎన్టీఆర్ నటించిన మూడు చిత్రాలు కూడా మిలియన్ డాలర్లను వసూలు చేసినవి గా ఎన్టీఆర్ రికార్డు నెలకొల్పాడు.
లేబుళ్లు: Jayaho Janatha, Tollywood records


