తిరుపతి లో రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ జనసేన సభ పెట్టి ఏపీ ప్రత్యేక హొదా విషయం ఫై కేంద్రాన్ని , ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగం లో పవన్ చేసిన వాఖ్యల ఫై తెలుగు దేశం ఎంపీలు నిప్పులు చెరుగుతుండగా , తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తీవ్రస్థాయిలో పవన్ విమర్శలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తన ప్రవర్తనను మార్చుకోవాలని, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పవన్ ఏమి చేస్తున్నాడు..నిద్ర పోతున్నాడంటూ విమర్శించారు. సడెన్ గా నిద్ర లేచి ప్రత్యేకహోదా కోసం ఎంపీలు రాజీనామా చేయాలనడం ఆయన అవివేకానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు తమిళనాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కాళ్లు, చేతులు విరగ్గొట్టించేవారని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు టిజి. మరి ఈ వాఖ్యల ఫై జనసేన కార్య కర్తలు , పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి