3, సెప్టెంబర్ 2016, శనివారం

అమ్మకి అదిరే గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య


నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించగా.. ఇప్పుడు రాజకోటలకు సంబంధించిన సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. గత షెడ్యూల్స్ వరకూ బాలయ్య సింగిల్ హ్యాండ్ తో షూటింగ్ నడిపించేయగా.. తాజా షెడ్యూల్ లో శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో నటిస్తున్న హేమమాలిని.. భార్య రోల్ లో చేస్తున్న శ్రియ కూడా జాయిన్ అయ్యారు. 

బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని తొలి రోజు షూటింగ్ కి రాగానే.. నందమూరి హీరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారట. తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనే నేసిన లేపాక్షి చీరను హేమమాలినికి ప్రెజెంట్ చేశారట బాలయ్య. ఈ నందమూరి హీరో తనకు ఇచ్చిన ప్రాధాన్యత విలువ చూసి.. ఆ బాలీవుడ్ నటి చాలా సంతోషించారట కూడా. అంతే కాదు.. గతంలో సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి తాను రెండు సినిమాలు చేసినప్పటి సంగతులను కూడా పంచుకున్నారట హేమమాలిని.  

ఎన్టీఆర్ తో కలిసి పాండవ వనవాసం.. శ్రీకృష్ణ విజయం చిత్రాల్లో నటించారు హేమమాలిని. ఆ రెండు పౌరాణికాలు కాగా.. ఇప్పుడు మళ్లీ రాజుల కాలానికి సంబంధించిన చిత్రంలో ఈమె తిరిగి తెలుగులో నటిస్తుండడం విశేషం. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని కోటల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కుతుండగా.. 2017 సంక్రాంతికి గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల కానుంది. 



లేబుళ్లు: ,

29, ఆగస్టు 2016, సోమవారం

శాతకర్ణి గురించి ఆమె ఎగ్జైట్ అయిపోయింది



గౌతమీపుత్ర శాతకర్ణి కొత్త షెడ్యూల్ ఈ రోజే ఆరంభమవుతోంది. ఈ షెడ్యూల్లోనే అలనాటి బాలీవుడ్ తార హేమమాలిని ‘శాతకర్ణి’ సెట్లోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాలో ఆమె బాలయ్య తల్లి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హేమమాలిని చాలా ఎగ్జైట్ అయిపోయింది. ఇలాంటి సినిమాలో తాను నటిస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందంటూ ఆమె ట్వీట్లు చేసింది.

‘‘తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో ‘గౌతమి’గా నటిస్తుండటం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. ఇది శాతవాహనుల పాలన నేపథ్యంలో సాగే సినిమా. తొలి శతాబ్దంలో ఇండియా మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన ఆంధ్రా (ప్రస్తుతం తెలంగాణ) రాజు శాతకర్ణి గురించి స్ఫూర్తినిచ్చే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తన తల్లి స్ఫూర్తితోనే శాతకర్ణి ఇదంతా సాధించినట్లు చరిత్ర చెబుతోంది. అలాంటి తల్లి పాత్రలో నేను కనిపించబోతున్నాను’’ అని హేమమాలిని ట్విట్టర్లో పేర్కొంది.

ఇక ఈ సినిమాలో హేమమాలినితో పాటు హాలీవుడ్ స్థాయిలో మంచి గుర్తింపున్న బాలీవుడ్ నటుడు కబీర్ బేడి విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. బాలయ్య సరసన శ్రియ కథానాయికగా నటిస్తుండగా.. ఆయన తనయుడు నందమూరి మోక్షజ్న కూడా ఓ చిన్న పాత్రలో తళుక్కుమంటాడని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు క్రిష్.


లేబుళ్లు: ,