నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజా షెడ్యూల్ కోసం మధ్యప్రదేశ్ వెళ్ళారు బలయ్యా. 18 రోజులపాటు అక్కడ షూటింగ్ జరుపుతారు. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని తదితరులు పాల్గొంటున్నారు.
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రారాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆదారంగా ఈ సినిమా రుపొందుతుంది. మొన్న హైదరాబాద్‌లో భారీ యుద్దనౌక నౌక ఎసెట్‌ను వేసి యాక్షన్ సన్నీవేశాలను చిత్రీకరించారు. అలాగే జార్జియాలో ఈ షెడ్యూల్ లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే సన్నివేశాలను 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో క్లైమాక్స్ ను భారీగా చిత్రీకరించారు. అంతకు ముందుకు మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. సినిమా చిత్రీకరణతో పాటు సీజీ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి