ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ ఖాతాలో మ‌రో కొత్త రికార్డు


టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు 2016 సంవ‌త్స‌రం ఓ రేంజ్ లో కలిసొచ్చింది. ఎన్టీఆర్ గ‌త యేడాది నటించిన ‘నాన్నకి ప్రేమతో’ .. ‘జనతా గ్యారేజ్’ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. నాన్న‌కు ప్రేమ‌తో ఎన్టీఆర్ కేరీర్‌లో ఫ‌స్ట్ టైం రూ.50 కోట్ల షేర్ రాబ‌ట్టిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్కితే, జ‌న‌తా గ్యారేజ్ రూ.83 కోట్ల షేర్ రాబ‌ట్టి, ఎన్టీఆర్ కేరీర్‌లోనే ఆల్ టైం హ‌య్య‌స్ట్ షేర్ రాబ‌ట్టిన సినిమాగాను, ఇటు టాలీవుడ్‌లో ఆల్ టైం టాప్‌-3 హ‌య్య‌స్ట్ వ‌సూళ్ల సినిమాగాను రికార్డుల‌కు ఎక్కింది.
కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేసిన ‘జనతా గ్యారేజ్’ ఇంకా రికార్డులను దక్కించుకుంటూనే ఉంది. 2016 లో మోస్ట్ వాచ్డ్ తెలుగు మూవీగా అరుదైన ఘనతను ఈ సినిమా దక్కించుకుంది. తెలుగులో ఎక్కువమంది టీవీలో చూసిన చిత్రంగా ‘జనతా గ్యారేజ్’ నిలిచింది.
ఈ విష‌యాన్ని టీవీ ఆడియన్స్ మోనటిరింగ్ ఏజన్సీ అయిన బీ ఏ ఆర్ సీ ఇండియా వారు ఈ విషయాన్ని ప్రకటించారు. మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ ప‌తాకంపై తెర‌కెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌-నిత్యామీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

కామెంట్‌లు