శాత‌క‌ర్ణి ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్‌

బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 12న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైంది. సినిమాపై ఉన్న భారీ హైప్ దృష్ట్యా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ బాల‌య్య కేరీర్‌లోనే అత్య‌ధికంగా జ‌రిగింది. బాల‌య్య సినిమాల్లో లెజెండ్ సినిమా మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా రూ.45 కోట్ల షేర్ రాబట్టింది. కానీ శాత‌క‌ర్ణి సినిమాకు ఏకంగా రూ.55 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.
శాత‌క‌ర్ణి ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ డీటైల్స్ :
నైజాం : 9 కోట్లు
సీడెడ్-ఉత్తరాంధ్ర : 12.5 కోట్లు
గుంటూరు-కృష్ణా : 7.7 కోట్లు
ఈస్ట్ : 3.2 కోట్లు
వెస్ట్ : 2.8 కోట్లు
నెల్లూరు : 2 కోట్లు
———————————–
ఏపీ+ తెలంగాణ = 37.2 కోట్లు
———————————–
కర్నాటక : 3.8 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 4 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 1.8 కోట్లు
———————————————-
టోట‌ల్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ 46.8 కోట్లు
———————————————-
ఓవ‌రాల్‌గా శాత‌క‌ర్ణి టోట‌ల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 46.8 కోట్లు జ‌రిగింది. ఇక శాత‌క‌ర్ణి రూ.50 కోట్లు సాధిస్తే బ‌య్య‌ర్లు, నిర్మాత‌లు లాభాల్లోకి వ‌చ్చేస్తారు.ఇక ఈ సినిమాకు వినోద‌ప‌న్ను ఏపీ, తెలంగాణ‌లో మిన‌హాయింపు ఉంది. ఇది కూడా సినిమాకు బాగా క‌లిసి రానుంది. ఓవ‌రాల్‌గా శాత‌క‌ర్ణి రూ.50 కోట్ల షేర్‌, రూ.80 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంది.



కామెంట్‌లు