పవన్‌కళ్యాణ్‌కీ ఆమెతో ప్రాబ్లమే

డిసెంబర్‌ 23న విడుదల కావాల్సిన 'నేను లోకల్‌' ఆ డేట్‌ మిస్‌ అయిపోయి, సంక్రాంతి కూడా అయిపోయిన తర్వాత తీరిగ్గా ఫిబ్రవరి 3న రిలీజ్‌ అవుతోంది. ఎప్పుడో పూర్తయిపోయిన చిత్రాన్ని ఇంత లేట్‌గా రిలీజ్‌ చేయడానికి కారణాలని వెతుకుతూ సినిమా సరిగ్గా రాలేదని, అంచేత రీషూట్లు చేసారని తేల్చింది. ఈ పుకార్లని నాని నవ్వుతూ కొట్టి పారేసాడు. 

డిసెంబర్‌ 23న విడుదల చేయాలంటే, కనీసం అందుకు ఇరవై రోజుల ముందుగా సినిమా పూర్తయిపోవాలని, కానీ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ బిజీగా వుండడం వల్ల అనుకున్న టైమ్‌కి పూర్తి చేయలేకపోయామని, అంతే తప్ప ఈ చిత్రం డిలేకి రీషూట్లు కారణం కాదని చెప్పాడు. 'నేను లోకల్‌' వరకు క్లారిటీ ఓకే కానీ కీర్తి సురేష్‌ బిజీ షెడ్యూల్స్‌ పట్ల మిగిలిన నిర్మాతలు వర్రీ అవ్వాల్సిన మేటర్‌ ఇది. ఎందుకంటే కీర్తి సురేష్‌ అటు తమిళం, ఇటు మలయాళంతో పాటు తెలుగులోను వచ్చిన ఆఫర్లన్నీ ఎడాపెడా ఓకే చేసుకుంటూ పోతోంది. 

వచ్చిన అవకాశాల్ని ఎందుకు వదులుకోవాలని అనుకుంటుందో ఏమిటో కానీ చిన్న, పెద్ద తేడా లేకుండా కొత్త సినిమాలకి సంతకం చేసేస్తోంది. దీని వల్ల ఆమెతో ఒప్పందం చేసుకున్నవాళ్లకి షెడ్యూల్స్‌ పరంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. 'నేను లోకల్‌' అంటే బడ్జెట్‌ తక్కువే కనుక, నాని సినిమాకి సీజన్‌తో పని లేదు కనుక ఓకే. కానీ రేపు పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమాకీ కీర్తి సురేష్‌ డేట్స్‌ ఇలాగే టైట్‌ అయిపోతే, అనుకున్న టైమ్‌కి రిలీజ్‌ చేయడం కష్టమేగా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కానీ, వేరొకరి దీపాన్ని గాల్లో పెట్టేసేలా ఉండకూడదు కదా! 

కామెంట్‌లు