తెలుగు టీవీ పరిశ్రమలో సత్తా చాటి, వెండి తెరపైకి షిఫ్ట్ అయిన ప్రముఖ యాంకర్ లాస్య, ‘రాజా మీరు కేక’ అనే సినిమాలో నటిస్తోంది. ఇలాంటి తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. ‘జీవితంలో ప్రత్యేక రోజు కోసం సిద్ధమవుతున్నందుకు ఆనందంగా ఉంది. నా సోల్ మెట్ తో ఎంగేజ్మెంట్ జరుగుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ప్రేమ విలువైంది, పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ ఎంతో ఆసక్తితో కూడుకున్నది’ అంటూ తన అనుభూతులను తెలియజేసింది. డిజైనర్ ఈశ్వరీ తయారు చేసిన ఎంగేజ్మెంట్ డ్రెస్ లో ఉన్న ఫోటోను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసిన లాస్య, తమ ఇద్దరి ముద్దు పేర్లతో కూడిన టాటూలను కూడా ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. తనకు కాబోయే శ్రీవారు ఎవరో అని నెటిజన్లకు ఆసక్తి కలిగే విధంగా చేసిన లాస్య, చివరికి ఆ ట్విస్ట్ ను రివీల్ చేస్తూ ఎంగేజ్మెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది. మరాఠీకి చెందిన మంజునాధ అనే వ్యక్తిని తానూ పెళ్ళాడబోతున్నట్లుగా, ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో జంట బాగుందంటూ శుభాకాంక్షలు చెప్పడం నెటిజన్ల వంతయ్యింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి