తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి హీరోల్లో నటరత్న నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తన వందో సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఓ అద్భుత చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చేశాడు. ఇక నందమూరి హీరోల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. చేసింది 26 సినిమాలే అయినా కూడా ఎక్కువ హిట్లు, ఎక్కువ రికార్డులు కొట్టిన హీరో ఎన్టీఆర్. అయితే తాజాగా ఓ కొత్త రికార్డు నందమూరి హీరోలపై నమోదైంది. అదే ఎన్టీఆర్-50, బాలయ్య-100.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25వ సినిమాగా వచ్చిన నాన్నకు ప్రేమతో భారీ హిట్ అయింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు. కాగా అప్పుడు నాన్నకు ప్రేమతో సినిమా టీజర్ సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ గా నిలిచింది. ఇప్పటిదాకా యాభై వేల లైకులు పొందిన మొదటి తెలుగు సినిమాగా అది రికార్డు సాధించింది. మరోపక్క నందమూరి బాలయ్య బాబు గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ ఏకంగా లక్ష లైకులు పొంది, లక్షల లైకులు పొందిన మొదటి తెలుగు సినిమాగా రికార్డు సాధించింది. మొత్తానికి ఇద్దరు నందమూరి హీరోలే ఈ రికార్డులను సాధించడం అభిమానులను సంతోషపరుస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి