బాలయ్య 100వ సినిమా శాతకర్ణి అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని ఈ నెల 5న సెన్సార్‌కు రెడీ అవుతోంది. ఇక సినిమా రిలీజ్ డేట్‌గా 12న ఎనౌన్స్ చేసేశారు చిత్ర నిర్మాతలు. శాతకర్ణి ఆడియో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. ట్రైలర్ కూడా యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో నందమూరి అభిమానులతో పాటు సినీ జనాలందరూ శాతకర్ణి కోసం వెయిట్ చేస్తున్నారు.
చాలా మంది శాతకర్ణి ఫస్ట్ షో చూసేయాలని ఆతృతతో కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే శాతకర్ణిని ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రత్యేక షో వేసి చూపించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. వీరి ఇద్దరికి ఉన్న టైం బిజీ దృష్ట్యా వీరికి వేర్వేరుగానే స్పెషల్ షోలు వేయనున్నారు. ఇక ఓవర్సీస్‌లో 11నే ప్రీమియర్లకు ప్లాన్ చేస్తున్నారు.
ఓవర్సీస్ ప్రీమియర్ల కంటే ముందుగానే శాతకర్ణి స్పెషల్ షో ఏపీ సీఎం చంద్రబాబు కోసం వేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు కోసం ముందుగా అమరావతిలో షో వేస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో తనకు సినిమా చూపించమని చంద్రబాబు నాయుడే స్వయంగా చిత్రబృందాన్ని కోరడంతో క్రిష్ అండ్ టీమ్ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.
శాతవాహనుడు అమరావతినే రాజధానిగా చేసుకుని పాలించారు. ఈ క్రమంలోనే బాబు ఆ సెంటిమెంట్ దృష్ట్యా ఇక్కడే శాతకర్ణి ప్రీమియర్ షో చూస్తారట. ఇక ఈ షోకు డేట్ అండ్ టైం ఆయనే ఫిక్స్ చేస్తారట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి