మరోకసారి ఒప్పందం చేసుకున్నా మెహన్ లాల్…

ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’లో నటించారు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్. ఇందులో ఎన్టీఆర్ పెదనాన్నగా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా సమయంలో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడీ స్నేహంతోనే మోహన్ లాల్ సినిమాకి ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు ఎన్టీఆర్.

మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో రూపొందిన ‘ఒప్పం’ చిత్రం అక్కడ భారీ వసూళ్లను సాధించింది. మోహన్ లాల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను ‘కనుపాప’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఆడియో ఫంక్షన్ కి ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారని తెలిసింది. మోహన్ లాల్ పై వున్న అభిమానంతో ఈ ఫంక్షన్ కి ఎన్టీఆర్ తప్పకుండా వస్తారనే టాక్.

కామెంట్‌లు