ఎన్టీఆర్ ని టచ్ చేయలేను అంటున్న స్టార్ హీరో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో చేసిన 26 సినిమాల్లో చాలా సినిమాలు నటుడిగా ఎన్టీఆర్ కి ఎనలేని కీర్తిని తీసుకోచ్చినవే…కానీ వాటిలో ఎన్టీఆర్ కి నటుడిగా పీక్స్ లో క్రేజ్ తెచ్చిన అతికొద్ది సినిమాల్లో టెంపర్ సినిమా ఒకటి.

రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాతో ఆల్ మోస్ట్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ రేంజ్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి గ్రేట్ నెస్ ఉన్న ఈ సినిమాను సౌత్ లో కానీ నార్త్ లో కానీ రీమేక్ చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు ఇన్ని రోజులు.

కాగా ఎట్టకేలకు రీసెంట్ గా బాజిరావ్ మస్తానీ ఫేమ్ రణవీర్ సింగ్ ఈ రీమేక్ కి సిద్ధం అయ్యాడు. కాగా ఎన్టీఆర్ యాక్టింగ్ ని రిప్లేస్ చేయగలవు అని అనుకుంటున్నావా అంటే అది కష్టం కానీ నావల్ల ఎంత అయితే అంత చేస్తా అని అంటున్నాడట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉందట.

కామెంట్‌లు