పోరాటంతో ఆరంభం…!


కథకు ఒక్కసారి పచ్చజెండా వూపానంటే చాలు… ఇక మళ్లీ దాని గురించి ఆలోచించనంటారు బాలకృష్ణ. సెట్‌లో దర్శకుడు చెప్పింది మెరుపు వేగంతో చేసుకొంటూ వెళ్లిపోతుంటారాయన. ఇంచుమించు పూరి జగన్నాథ్‌ శైలి కూడా అంతే.

కొన్ని నెలల ముందుగానే స్క్రిప్టుని పక్కాగా సిద్ధం చేసుకొని స్పష్టతతో సెట్స్‌పైకి వెళతారు. అందుకే ఆయన సినిమాలు టంచనుగా అనుకొన్న సమయానికే విడుదలవుతుంటాయి. కొబ్బరికాయ కొట్టినరోజునే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుంటారు.

బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న సినిమా విడుదల తేదీనీ ప్రకటించారు. ఇటీవలే అట్టహాసంగా ప్రారంభమైన ఆ చిత్రం సెప్టెంబరు 29న ప్రేక్షకుల ముందుకొస్తుంది. గురువారం నుంచి ఒక పోరాట ఘట్టంతో చిత్రీకరణ మొదలుపెట్టారు.

ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ నేతృత్వంలో బాలకృష్ణ, ఫైటర్లపై పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 21 వరకు హైదరాబాద్‌లోనే ఆ సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఆ తర్వాత కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ముగ్గురు కథా నాయికలు నటిస్తారు.

కామెంట్‌లు