ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉగాది జాతరే…



యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్27…మొదలు అవ్వడం ఎదో సాదాసీదా కమర్షియల్ మూవీగా మొదలైన ఈ సినిమా ఇప్పుడు మాత్రంఓ రేంజ్   లో అంచనాలను పెంచేస్తూ సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది.

కాగా సినిమా మొదలైనా అందులో ఎన్టీఆర్ పాల్గొన్నా సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందని అందులో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడా అని అందరిలోనూ ఉత్కంట నెలకొంది…కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ న్యూస్ మాత్రం హాల్ చల్ చేస్తుంది.

ఆ న్యూస్ ప్రకారం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ అనౌన్స్ మెంట్ ఈ ఉగాదికి బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అది కనుక జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ ఉగాది జాతరే అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కామెంట్‌లు