సుచిత్ర లీక్స్ లో అనూహ్య మలుపు



ఆ మధ్య సుచిత్ర లీక్స్ ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. అసలు ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందో లేదో కానీ, ఓ ఇద్దరి నటీమణులు జీవితం మాత్రం ఆమె లీక్ చేసిన వీడియోతో దుర్బరం అయిందని చెప్పాలి. అదే విధంగా సుచిత్ర ఎకౌంటు నుంచి బయటపడిన మరికొన్ని డీటైల్స్ కూడా చాలా డిస్ట్రబింగ్ గా ఉన్నాయి.

సినిమా లోకంలో ఇలాంటి చీకటి కోణం కూడా ఉన్నదా అనిపించేలా ఉన్నాయి. అవన్నీ నిజాలా కాదా అని పక్కన పెట్టేస్తే, ఆ అకౌంట్ నుంచి వచ్చిన హింట్స్ ని బట్టి చూస్తే ఆమె ధనుష్-త్రిష-హన్సిక-మలాపాల్-దివ్యదర్శిని-ఆండ్రియా-అనిరుధ్ వంటి వారిపై చేసిన ఆరోపణలకు తగిన సాక్షాలు కనిపిస్తున్నాయి.

అవన్నీ చూసినవారికి ఎవరైనా కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే మొత్తం మ్యాటర్ ఇప్పుడు అనూహ్య మలుపు తిరుగుతుంది అంటూ తమిళనాట పుకార్లు వినిపిస్తున్నాయి. సింగర్ సుచిత్రను ఎవరో కిడ్నాప్ చేశారని అక్కడి వార్తల సారాంశం. ఈమె లీక్ చేసిన యవ్వరంతో ఇబ్బందులు పడినవారు, ఆమెని కిడ్నాప్ చేయించారని, ఆమె దగ్గర ఉన్న డేటా అంతా తీసుకున్నాకే ఆమెని వదులుతారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరు అధికారికంగా స్పందించలేదు కాబట్టి మనం కూడా ఏమి జరుగుతుందో క్లియర్ గా చెప్పడం కష్టమే

కామెంట్‌లు