యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా 2003 లో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు…ఆ సినిమా సృష్టించిన చరిత్రను అందుకోవడానికి ఎన్టీఆర్ కి 13 ఏళ్ళు పట్టింది అంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
కాగా ఇప్పుడు టోటల్ ఇండియాని ఊపేస్తున్న బాహుబలిలో అసలు సిసలు ట్విస్ట్ కి కారణం సింహాద్రి సినిమా అంటే నమ్ముతారా….అవుననే అంటున్నాడు రాజమౌళి…తన సన్నిహితులతో చెబుతూ సింహాద్రి ఇంటర్వెల్ లో భూమిక ఎన్టీఆర్ ని పొడిచే సీన్ ఎంతటి షాకింగ్ గా రిపీట్ వ్యూస్ రావడానికి కారణమయ్యిందో తెలిసిందే.
అదే సీన్ ని స్ఫూర్తిగా చేసుకుని కట్టప్ప బాహుబలిని చంపే సీన్ ని రెడీ చేయించాడట జక్కన్న…ఆ సీన్ కి మూలం సింహాద్రి అని ఇప్పుడు అందరినీ షాకింగ్ కి గురిచేసింది…బాహుబలి 2 లో కట్టప్ప ఎందుకు పొడిచాడో క్లారిటీ ఇస్తాడు కాబట్టి ఆ సినిమా కోసం ఇప్పుడు అందరు ఆశగా ఎదురుచూస్తున్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి