కాటమరాయుడు నిర్మాతల చిల్లర దంద…!!


రాను రాను సినిమాలు పూర్తిగా వ్యాపారంగా మారిపోతున్నాయి. దీనికి సరైన ఉదాహరణే ఈ సంఘటన. త్వరలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రం విదుదల అవబోతుందని అందరికే తెలిసిందే. అయతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన కాష్టుమ్స్ అన్నింటినీ ఆన్ లైన్ ఆఫ్ లైన్ ద్వారా అమ్మడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. ఇటీవల కాలంలో సినిమా పరంగా, రాజకీయ పరంగా కూడా ఎలా చూసినా ఇప్పుడు హాట్ టాపిక్ పవన్ కళ్యాణ్.
అయితే ఈ క్రేజ్ ను సొమ్ము చేసుకోవడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. ఇంకా సినిమా విడుదలే కాలేదు అప్పుడే వస్తువులను అమ్మకానికి పెట్టడం పై నెటిజన్లు సోషల్ మీడియా లో పెదవి విరుస్తున్నారు. సినిమా హిట్ అయితేనే పవన్ వాడిన వస్తువులకు క్రేజ్ పెరుగుతుంది కానీ, ఒక వేల ఫట్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటనే కోణంలో ఆలోచించిన నిర్మాతలు ఈ విధంగా ప్లాన్ చేసినట్లు ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది.

కామెంట్‌లు