నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ ఇమేజ్ కోసం ఇప్పటికీ ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్. టాలీవుడ్‌లో ఇటు హీరోగాను, అటు నిర్మాతగాను వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. నిర్మాతగా తన సినిమాలతో పాటు అటు ఇతర హీరోలతోను సినిమాలు చేస్తున్నాడు.
2015లో పటాస్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన కళ్యాణ్ రామ్, తరువాత షేర్, ఇజం సినిమాలతో మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం నిర్మాతగా ఎన్టీఆర్, బాబీల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా (వర్కింగ్ టైటిల్ జై లవ కుశ ) నిర్మాణంలో బిజీబిజీగా ఉన్న కళ్యాణ్ తాను హీరోగా చేయబోయే సినిమా కోసం ఓ మంచి టీంను సెట్ చేసే పనిలో ఉన్నాడట.
కళ్యాణ్ బాబాయ్ బాలయ్యతో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు క్రిష్, ఈ మధ్య కళ్యాణ్ రామ్‌కు ఓ కథ చెప్పాడట. ఈ కథ కళ్యాన్‌కు బాగా నచ్చిందట. బాబాయ్ బాలయ్యకు భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు తనతో సినిమాకు రెడీ అయ్యే సరికి కళ్యాణ్ రామ్ తెగ సంబరపడిపోతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి