రిలీజ్‌కి అయిదారు రోజుల ముందు థియేట్రికల్ రిలీజ్ చేయడం వల్ల క్రేజ్ బాగా వుంటుందని, అది సద్దుమణగక ముందే సినిమా రిలీజ్ అయితే వసూళ్ల వర్షం కురుస్తుందని 'కాటమరాయుడు' ట్రెయిలర్ రిలీజ్‌ని డిలే చేస్తున్నారు. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రెయిలర్‌ని రిలీజ్ చేస్తారు. ఈ స్ట్రాటజీ ఇంతవరకు బాగానే వుంది కానీ 'బాహుబలి' ట్రెయిలర్ తర్వాత ఈ ట్రెయిలర్ వస్తోంది కనుక తప్పకుండా దానితో పోలికలు వస్తాయి.
కాటమరాయుడు సగటు మాస్ సినిమా కనుక ఇందులో ఎలాంటి ప్రత్యేకతలు వుండవు. అసలే బాహుబలి ట్రెయిలర్ చూసిన మాయలో వున్న జనం ఇప్పుడేం చూపించినా పెదవి విరిచే అవకాశాలే ఎక్కువ. పైగా ఎప్పుడు గిల్లుదామా అని ఎదురు చూసే రాంగోపాల్‌వర్మ ఇదే అదనుగా కాటమరాయుడిపై ట్వీట్ల శరాలు కురిపించవచ్చు. కాటమరాయుడు టీజర్ వచ్చినపుడు ఒక్క రోజులో ఇన్ని లక్షల మంది చూసారు, రికార్డు అంటూ చెప్పుకున్నారు. కానీ బాహుబలి ట్రెయిలర్‌ని అన్ని భాషల్లో కలిపి అయిదు కోట్ల సార్లు చూసేసరికి ఇప్పుడు ఒక్క రోజులో వచ్చే లక్షల వ్యూస్ ఎవరికీ ఆనవు.
ట్రెయిలర్ రిలీజ్ డిలే చేయడం మాత్రం కాటమరాయుడికి రివర్స్ కొట్టింది. అది కూడా బాహుబలి 2 తర్వాత రెండు రోజులకి రిలీజ్ చేస్తుండడం మరింత ఎఫెక్ట్ చేస్తుంది. తమకి తెలియకుండానే ఈ మిస్టేక్ చేసిన కాటమరాయుడు బృందం ఈ ప్రతికూలతని అధిగమించేట్టుగా ట్రెయిలర్‌లో ఎలాంటి మసాలాలు దట్టించిందనేది చూడాల్సిందే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి