సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎదిగే క్రమంలో ఎలాంటి అనుభూతులను చవిచూసామో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దగ్గర నుండి స్మాల్ హీరోయిన్ మాధవిలత వరకు చాలామంది చెప్పుకొచ్చారు. అయితే ఇది ఒక్క టాలీవుడ్ కే పరిమితం కాదు, ఏ సినీ పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపు కాదన్న విషయాన్ని పలువురు హీరోయిన్లు చెప్పకనే చెప్పారు. తాజాగా తనకు ఎదురైన అనుభవం గురించి తమిళ హీరోయిన్ లేఖ వాషింగ్టన్ చెప్పుకొచ్చింది.
బుల్లితెర టీవీ యాంకర్ స్థాయి నుండి సిల్వర్ స్క్రీన్ స్థాయికి వచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరగా చేసిన సినిమా “కళ్యాణ సమయాల్ సాధం.” ఆ తర్వాత ఒకటి, రెండు సినిమాలలో అతిథి పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా ‘కమినా’ అనే చిత్రంలో నటించింది. 2014 తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీ వర్గాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఇండస్ట్రీలోని పోకడ గురించి ఓ బాంబు పేల్చింది. సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టమని, ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది.
తానూ కూడా కెరీర్ లో కూడా ఓ తమిళ దర్శకుడితో సెక్స్ టార్చర్ అనుభవించానని, తనకు కధ చెప్పడానికి వచ్చిన ఆ దర్శకుడు, అది పూర్తయిన తర్వాత ‘ఈ సినిమాలో నీకు అవకాశం ఇస్తే నాకేం ఇస్తావు?’ అని అడిగాడని, అతని దుర్భుద్ధి తనకు అర్ధమైనా, అర్ధం కానట్లుగా ప్రవర్తిస్తే… పదే పదే అదే ప్రశ్న వేసి సినిమా ఆద్యంతం విసిగించాడని ఆవేదన చెందుతూ చెప్పుకొచ్చింది. ఇలా తమ చేదు అనుభవాలను బయట పెడుతున్న హీరోయిన్ల జాబితా అంతకంతకూ పెరుగుతూ పోతుండడంతో, ఇంకెంతమంది బయట పడతారో చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి