కాలగర్భంలో మరో యేడాది కలిసిపోయింది. మరో రెండు రోజుల్లో 2016 సంవత్సరం చరిత్రపుటల్లో కలిసిపోనుండగా 2017 కొత్త యేడాదిలోకి ఎంట్రీ ఇస్తున్నాం. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో 2016 వరకు చూసుకుంటే ఏ హీరో టాప్ అని లెక్కలేసుకుంటే .. ఏ హీరో అభిమానులు ఎవరికి వారే తమ హీరోనే గొప్ప అని…నెంబర్ వన్ అని చెప్పుకుంటారు. వాస్తవంగా చూస్తే మరి ఏ హీరో 2016లో టాలీవుడ్ టాప్ హీరోగా గణాంకాలు చెపుతున్నాయో చూద్దాం.
ఈ యేడాది అగ్రహీరోల్లో బాలయ్య డిక్టేటర్‌తో బిలో యావరేజ్ మార్కులు వేయించుకున్నాడు. బాలకృష్ణతో పాటే సంక్రాంతికి వచ్చిన నాగార్జున బాక్సాఫీసుని బద్దలు కొట్టాడు. సోగ్గాడే చిన్నినాయన రూపంలో కెరీర్ బెస్ట్ గ్రాసర్ ని అందుకున్నాడు. ఊపిరితో మళ్ళీ మెరిసిన నాగ్, తన ఖాతాలో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక టాప్ 2 హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పూర్తిగా నిరాశపరిచారు. ఈ యేడాది వీరిద్దరు నష్టాల విషయంలో పోటీపడ్డారు. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం .. రెండు ఈ ఏడాదికి రెండు అతిపెద్ద డిజాస్టర్ సినిమాలు. సమ్మర్ లో వచ్చిన బన్ని రూ.70 కోట్లు కొల్లగొట్టి కేరీర్లోనే టాప్ హిట్ సాధించాడు.
మరో అగ్రహీరో విక్టరీ వెంకటేష్ బాబు బంగారం యావరేజ్ గా నిలిచింది. రాంచరణ్ ధృవ మనోడికి చాలా రోజుల తర్వాత రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా చేసింది. యువహీరోల్లో వరుస విజయాలు అందుకుంటున్న నటుడు నాని. ఈ ఏడాదిలో మూడు విజయాలు (కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్‌మెన్, మజ్ను) ఉన్నాయి. మరే యువహీరోకు దక్కని క్రెడిట్ నానికి లభించింది.
అక్కినేని మూడవతరం వారసుడు నాగచైతన్య నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ప్రేమమ్ మంచి విజయాన్ని అందించింది. నోట్ల రద్దు తర్వాత విడుదలైన సాహసం శ్వాసగా సాగిపో యావరేజ్ అయ్యింది. నితిన్ అ..ఆతో రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి కేరీర్‌లోనే తిరుగులేని హిట్ కొట్టాడు.
2016 టాప్ హీరో ప్లేస్ ఎన్టీఆర్‌దే…తిరుగులేదు :
ఇక ఈ యేడాది టాప్ ప్లేస్ కొట్టేసిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి రెండు సూపర్ హిట్లు సొంతం చేసుకున్నాడు. కేవలం 7 నెలల వ్యవధిలో ఎన్టీఆర్ రెండు రూ.50 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. నాన్నకు ప్రేమతో రూ.55 కోట్ల షేర్ సాధిస్తే, గ్యారేజ్ ఏకంగా రూ.83 కోట్ల షేర్ సాధించి….ఎన్టీఆర్ కేరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు టాలీవుడ్ ఆల్ టైం టాప్-3 సినిమాలలో ఒకటిగా నిలిచింది. సో ఈ యేడాదికి ఎన్టీఆరే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ర్యాంకు సొంతం చేసుకున్నట్టే అనుకోవాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి