చరణ్ బాబుకి ఆ వయసు రాలేదట


రామ్ చరణ్ ఇప్పడు ఫుల్లు బిజీ. డిసెంబర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకూ గ్యాప్ లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. ఆ తర్వాత ప్రమోషన్స్.. యూఎస్ టూర్.. తిరిగి రాగానే ఇంటర్వ్యూలు.. ఇప్పుడు మెగా 150కి ప్రొడ్యూసర్ గా వర్క్స్.. ఇలా తెగ బిజీగా ఉన్నాడు చెర్రీ. అయినా సరే ఇంటర్వ్యూల్లో చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచాడు మెగా పవర్ స్టార్. 

కొంతకాలంగా ఎదురుచూస్తున్న స్థాయి హిట్ కొట్టారు కదా.. మరి మీరు తండ్రి అయ్యేదెపుడు అనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి చెర్రీకి ఎదురైంది. దీనికి చరణ్ ఇచ్చిన ఆన్సర్ ఇంకా అదిరింది. 'నేనింకా చిన్నపిల్లాడినే అనుకుంటూ ఉంటాను. తండ్రి కావడం గురించి ఇంకా ఆలోచన కూడా లేదు. నా వైఫ్ నేను మరింతకాలం ఏకాంతంగా జీవించాలని అనుకుంటున్నాం.' అని చెప్పాడు చెర్రీ. 

మరోవైపు రీమేక్స్ విషయంలో కూడా చరణ్ స్మార్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు. గతంలో జడ్జిమెంట్ లోపాల కారణంగా కొన్ని సినిమాలు నిరుత్సాహపరిచాయని అన్న చెర్రీ.. రిజల్ట్ ఊహించలేని ఒరిజినల్స్ కంటే.. కాన్ఫిడెంట్ గా అనిపించిన రీమేక్స్ చేయడంలో తప్పేం లేదంటూ కామెంట్ చేశాడు. తండ్రి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పనులతో సంక్రాంతి వరకూ తాను బిజీ బిజీ అన్న చరణ్.. ఆ తర్వాత రెండు వారాలు గ్యాప్ తీసుకుని.. ఫిబ్రవరి మొదట్లో సుకుమార్ సినిమాని స్టార్ట్ చేస్తానని అన్నాడు. 


కామెంట్‌లు