మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు కుర్రాళ్ళకు ఎంత సేపు చూసినా తనివితీరవు. బాహుబలి తర్వాత ఈ మిల్కీబ్యూటీ కేరీర్ ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రీసెంట్‌గా విశాల్ పక్కన ఆమె నటించిన ఒక్కడొచ్చాడు సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో తమ్మూ బేబీ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చేసింది.
తాను త్వరోలనే పెళ్లి చేసుకుంటానని… తన మనసుకు నచ్చిన వ్యక్తి ఇంతవరకు కనిపించలేదు. వీలైనంత వరకు ఇంట్లో వాళ్ళు చెప్పిన అబ్బాయినే చేసుకుంటా, ఒక వేళా నాకు ఎవరైనా నచ్చితే ఇంట్లో ఒప్పించే పెళ్లి పీటలెక్కుతా అని క్లారిటీ ఇచింది. ఇక పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తారా ? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ బాలీవుడ్‌లో విద్యా బాలన్, కరీనా కపూర్ పెళ్లి తరువాత కూడా నటిస్తున్నారు కదా ? అలాంటప్పుడు నేను ఎందుకు నటించకూడదని ప్రశ్నించింది.
ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాత తన పిల్లలను తీసుకుని కూడా సెట్‌కు వస్తానని చెప్పింది. ఇక మారిన టెక్నాలజీ నేపథ్యంలో చాలా మంది స్మార్ట్ ఫోన్స్ వల్ల మనుష్యులకు దూరమైపోతున్నారని.. తన వరకు అయితే ఇంటికి వెళ్లినా, ఫ్రెండ్స్‌ను కలిసినా ఇంటికి దూరంగా ఉంటానని చెప్పింది.
ఇక న్యూ ఇయర్ సందర్భంగా తాను ప్రత్యేకంగా ఏమీ రిజల్యూషన్స్ పెట్టుకోలేదని..తన వరకు అయితే తన బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలన్నదే తన గోల్ అని చెప్పకొచ్చింది మిల్యీబ్యూటీ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి