ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరోల అభిమానులు తమ హీరోనే గొప్ప అంటూ రకరకాల రికార్డులను ప్రచారం చేసుకోవడం కామన్. ఈ క్రమంలోనే టాలీవుడ్లో యంగ్ హీరోల అభిమానుల మధ్య సైతం ఇలాంటి వారే నడుస్తోంది. తాజాగా ధృవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఓ రికార్డును క్రాస్ చేశాడు.
ఎప్పుడో 2012లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్ షా సినిమా ఓవర్సీస్‌లో సాధించిన రికార్డును చెర్రీ ధృవతో బీట్ చేశాడు. నాలుగున్నర సంవత్సరాల క్రితమే బాద్ షా సినిమా ఓవర్సీస్‌లో 1.28 మిలియన్ డాలర్లను కలెక్ట్ చెయ్యగా, ఇప్పుడు ధృవ 1.29 మిలియన్ డాలర్స్ వసూలు చెయ్యడంతో యంగ్ టైగర్ రికార్డ్ ను చరణ్ బ్రేక్ చేసినట్లయ్యింది.
మరో విశేషం ఏంటంటే చెర్రీకి ఓవర్సీస్‌లో ఇదే తొలి మిలియన్ మార్క్ సినిమా. ఈ రికార్డును చెర్రీ అభిమానులు ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ రికార్డు బీట్ చేసిన చెర్రీ అని పోస్టులు పెడుతున్నారు. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు కౌంటర్ ఎటాక్ చేస్తూ జోకులు వేసుకుంటున్నారు.
అప్పుడెప్పుడో వచ్చిన బాద్ షా రికార్డును బ్రేక్ చేయడానికే చెర్రీకి ఇన్ని సంవత్సరాలు పడితే ఇక టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ సినిమాల రికార్డులు బీట్ చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో మీ చెర్రీకి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెర్రీ రికార్డుపై జోకులు వేసుకుంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి