సీడెడ్‌లో అప్పుడే రికార్డుల పర్వం మొదలెట్టిన ఎన్టీఆర్


ఒకప్పుడు ఎన్టీఆర్ రేంజ్ యావరేజ్‌గానే ఉండేది.. కానీ ‘టెంపర్’ తర్వాత అతని కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఆ చిత్రం అతడ్ని నటుడిగా ఓ స్థాయికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత చేసిన ‘నాన్నకు ప్రేమతో’ మూవీ అన్నివర్గాల ఆడియెన్స్‌ని దగ్గర చేసింది. ఇక ‘జనతా గ్యారేజ్’ మూవీ ఆల్‌టైం రికార్డుల జాబితాలో మూడోస్తానం సంపాదించి సంపాదించుకుని.. తారక్ క్రేజ్‌ని తారాస్థాయికి పెంచేసింది. దీంతో.. ఈ యంగ్ టైగర్‌ తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా.. బాబీలాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్‌తో తారక్ తన ప్రెస్టీజియస్ 27వ చిత్రం చేస్తుండడంతో.. దానికి మరింత క్రేజ్ వచ్చిపడింది.

ఈ కారణంగానే.. ఇంకా సెట్స్ మీదకి వెళ్ళకుండానే ఈ సినిమా కళ్ళుచెదిరే రేంజులో ప్రీ-రిలీజ్ చేస్తోంది. అవును.. మీరు చదువుతోంది నిజమే. అసలు ప్రారంభోత్సవం కూడా జరుపుకోని ఈ మూవీ రైట్స్‌ని సొంతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. భారీ అమౌంట్‌ ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఓ ప్రముఖ పంపిణీదారుడైతే ఈ మూవీ సీడెడ్ రైట్స్‌ని దక్కించుకోవడం కోసం దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న వార్త ప్రకారం.. ఈ మూవీ సీడెడ్ హక్కుల కోసం రూ.14.75 కోట్లు ఆఫర్ చేశాడట. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఒకవేళ అది నిజమైతే ఆ ఏరియాలో గత రికార్డులన్నీ తుడిచిపోయినట్లే.

ఇప్పటివరకైతే పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆ ఏరియాలో రూ.12 కోట్లపైనే ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా రైట్స్ రూ.14.75 కోట్లకు అమ్ముడుపోయినట్లుగా వస్తున్న వార్తలు నిజమైతే.. పవన్ రికార్డ్ కుదేలయిపోయినట్లే.


కామెంట్‌లు