దారుణం : ‘ధృవ’ సినిమా చూసి.. ఇద్దరు ఫ్యాన్స్ మృతి


తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ దారుణం చోటు చేసుకుంది. తమ అభిమాన నటుడు రామ్ చరణ్ తాజా చిత్రం ‘ధృవ’ సినిమా చూసిన అనంతరం ఇద్దరూ మెగా ఫ్యాన్స్ ఇంటికి తిరిగి వెళ్తుండగా.. దుర్మరణం పాలయ్యారు. వీళ్లు ఆటోలో వెళుతుండగా.. అత్యంత వేగంగా వస్తున్న లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

వావిలాల గ్రామానికి చెందిన 14 మంది రామ్ చరణ్ అభిమానులు ‘ధృవ’ సినిమా చూసేందుకు అయిజ అనే పట్టణానికి ఓ ఆటోలో వెళ్ళారు. మూవీ చూసిన అనంతరం వీరంతా ఇంటికి తిరుగు పయనమవ్వగా.. ఓ ప్రాంతంలో చాలా స్పీడుగా వచ్చి ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో.. ఆ ఆటోలో ఉన్న 14 మందిలో సతీష్, రాజు అనే యువకులు చనిపోగా.. మిగతా 12 మంది గాయాల పాలయ్యారు. వీరందరినీ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

ఆ 12 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సినిమా చూసి వస్తారనుకున్న తమ కుమారులు (సతీష్, రాజు) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


కామెంట్‌లు