ఎన్టీఆర్ పేరు తలచుకొని.. కన్నీటిపర్యంతమైన సప్తగిరి


కమెడియన్ సప్తగిరి తొలిసారి కథానాయకుడిగా నటించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ మంచి విజయం సాధించింది. ఈ మూవీతోపాటు బరిలో మరో మూడు చిత్రాలు విడుదలైనా.. ఆ పోటీని ధీటుగా ఎదుర్కొని అంచనాలకు మించే భారీ వసూళ్లు రాబడుతోంది. నిజానికి.. ఈ చిత్రానికి రివ్యూలు అంతగా ప్రోత్సాహకరంగా రాలేదు. విమర్శకులు కూడా ఈ చిత్రానికి అంత సీన్‌ లేదంటూ పెదవి విరిచారు. కానీ.. అవేవీ ఈ చిత్రంఫై ఎఫెక్ట్ చూపలేదు. మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. దీంతో.. ఈ చిత్రబృందం ఆడియెన్స్‌కి కృతజ్ఞతలు చెబుతూ సక్సెస్ టూర్‌లు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగానే.. బుధవారం విశాఖపట్టంలోని అనకాపల్లి టౌన్‌ మెయిన్ రోడ్డు దగ్గర శ్రీసత్య థియేటర్‌లో చిత్రబృందం సందడి చేసింది. తమ చిత్రానికి ఇంతపెద్ద విజయం అందించినందుకు ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ.. తన 12 ఏళ్ల కష్టానికి ఈరోజు ఫలితం చూశానని అన్నాడు. ప్రేక్షకులే దేవుళ్లుగా నిలబడి తనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రేక్షకుల కోసం ఎంత దూరమైనా వస్తానని, ఇది మీరిచ్చిన జీవితమని చెప్పాడు. ఇక ఇదే సమయంలో మహానటుడు ఎన్టీఆర్ పేరుని తలచుకొని కన్నీంటి పర్యంతమయ్యాడు. ‘దాన వీరశూరకర్ణ’మూవీలో ఆ మహానటుడు చెప్పిన ఒక్క డైలాగు తానూ చెప్పడంతో.. అది తన జీవితాన్ని మార్చేసిందని ఆనందభాష్పాలతో వెల్లడించాడు. ఆ డైలాగ్ పూర్తిగా చెప్పాలని ప్రజలు కోరగా.. అది చెప్పి సప్తగిరి అందరినీ ఆకట్టుకున్నాడు.


కామెంట్‌లు