బాలయ్య ఒక్కోసారి ఎలాంటి డెసిషన్లు తీసుకుంటాడో ఆయనకే తెలియదన్నట్లుగా ఉంటుంది. ఆయన ఇచ్చిన మాటకోసం కట్టుబడి ఆ డైరెక్టర్ క్రేజ్, వాల్యూ పట్టించుకోకుండానే చాలా మంది ఛాన్సులు ఇచ్చేస్తుంటాడు. అలా ఛాన్సులు ఇచ్చినప్పుడల్లా బాలయ్య సినిమాలు ప్లాప్ అయినా మళ్లీ తిరిగి భారీ రిస్క్‌లు చేస్తుంటాడు.
సింహా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాసరి నారాయణ రావుతో ‘పరమవీరచక్ర’ లాంటి సినిమా చేస్తాడని ఎవరూ అనుకోలేదు. సినిమా డిజాస్టర్లకే డిజాస్టర్ అయ్యింది. లెజెండ్ తర్వాత సత్యదేవా లాంటి కొత్త డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తాడని ఎవ్వరైనా ఊహించారా..రిజల్ట్ సేమ్ టు సేమ్. లయన్ డిజాస్టర్ అయ్యింది.
మళ్లీ ఇప్పుడు బాలయ్య పెద్ద సాహసమే అనేకన్నా…భారీ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా అంటే అవుననే ఆన్సరే వస్తోంది. తన వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్న బాలయ్య.. దీని తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేస్తాడంటూ ఒక షాకింగ్ రూమర్ బయటికి వచ్చింది.
కృష్ణారెడ్డి కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని…. ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందని… బాలయ్యకు సన్నిహితుడైన ‘వారాహి చలనచిత్రం’ అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడన్న రూమర్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
దీనిపై బాలయ్య అభిమానులు సైతం అసంతృప్తితో ఉన్నారు. కృష్ణారెడ్డి ఒకప్పుడు టాప్ ఫాంలో ఉండగా బాలయ్యతో ‘టాప్ హీరో’ అనే సినిమా తీశాడు. అది ఫ్లాప్ అయింది. చివరగా ఆయన నుంచి వచ్చిన యమలీల-2 డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు కృష్ణారెడ్డితో బాలయ్య సినిమా నిజమైతే అది రాంగ్ స్టెప్పే అని బాలయ్య అభిమానులే అంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి