ఎన్టీఆర్ మనసు మార్చుకున్నాడా…!


అటు అభిమానులను, ఇటు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. సెప్టెంబర్‌ నుండి ఈ మూవీ సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని పతాకంపై రాధాకృష్ణ తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌, పవన్‌ కళ్యాణ్‌తో తెరకెక్కించే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉండగా, ఈ మూవీని ఆగష్టు లోపు కంప్లీట్‌ చేయాలని అనుకుంటున్నాడు.

ఆ తరువాత కొద్ది రోజులు గ్యాప్‌ తీసుకొని సెప్టెంబర్‌లో ఎన్టీఆర్‌తో సెట్స్‌ మీదకు వెళ్లనున్నాడు మాటల మాంత్రికుడు. అంతలోపు ఎన్టీఆర్‌ కూడా బాబీతో కమిట్‌ అయిన సినిమాను కంప్లీట్‌ చేసుకోనున్నాడు. ఇక ఈ మూవీకి కోలీవుడ్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌ అనిరుధ్‌నే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

అయితే   జనతా గ్యారేజ్ సక్సెస్ తరువాత నెక్ట్స్ సినిమా ఎంపిక కోసం చాలా రోజుల పాటు ఎదురుచూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫైనల్ గా కొత్త సినిమాను ఎనౌన్స్ చేశాడు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ను తీసుకోవాలని భావించారు. అయితే త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా ముగ్గురు ముద్దుగుమ్మలు అలరించనున్నారు. కాజల్ అగర్వాల్ తో పాటు నివేదా థామస్, అనుపమా పరమేశ్వరన్ లను హీరోయిన్లుగా తీసుకోవాలని భావిస్తున్నారు.

అయితే ఈ ఏడాది నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి భారీ విజయాలను నందమూరి అభిమానులకు అందించిన ఎన్టీఆర్ మరో సక్సెస్ ని టేస్ట్ చూపించాలని ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేం బాబీతో జతకట్టాడు. ఎన్టీఆర్ 27వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మాణంలో రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఎన్టీఆర్ 27వ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించనున్నాడనే టాక్ వినిపిస్తోండగా, అందాల భామలు కాజల్ .. నివేదా థామస్ .. అనుపమ పరమేశ్వరన్ లు కథానాయికలుగా ఎంపికైనట్టు సమాచారం. ఇక సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ నే ఎంపిక చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలకు దేవి సంగీతం అందించగా, ఇది కూడా సక్సెస్ లో సగభాగం అయింది. ఈ క్రమంలో ఆ సెంటిమెంట్ ని మరో సారి రిపీట్ చేయాలని యంగ్ టైగర్ భావిస్తున్నాడట. మరి ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాకు తనదైన స్టైల్ లో బాణీలు అందిస్తోన్న దేవి, ఎన్టీఆర్ సినిమాకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో చూడాలి.


కామెంట్‌లు