శాతకర్ణి.. రికార్డ్ రికార్డ్



అద్భుతమైన విజువల్స్ తో కట్టి పడేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిన్న సాయంత్రం ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి తెలుగు నెటిజన్ల మధ్య వేరే టాపిక్స్ అన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించే చర్చ. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ హంగామా మామూలుగా లేదు. తెలుగు సినిమా ట్రైలర్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది ‘శాతకర్ణి’ ట్రైలర్. అత్యంత వేగంగా మిలియన్ మార్కును అందుకున్న తెలుగు ట్రైలర్ గా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రికార్డు సృష్టించింది. కేవలం 4.5 గంటల్లోనే ‘శాతకర్ణి’ ట్రైలర్ ఈ రికార్డును అందుకుంది. లైక్స్ పరంగా కూడా రికార్డుల్ని తిరగరాసింది. సంక్రాంతికే రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ టీజర్ కూడా రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. అది 3 గంటల 5 నిమిషాల్లోనే మిలియన్ మార్కును అందుకుని.. తెలుగు టీజర్ల రికార్డుల్ని తిరగరాసింది. ఇప్పుడు బాలయ్య ట్రైలర్ రికార్డుల్ని వేటాడేశాడు. కేవలం తెలుగు వరకే కాదు.. మిగతా భాషల వాళ్లను కూడా ‘శాతకర్ణి’ ట్రైలర్ మెస్మరైజ్ చేస్తోంది. బాలీవుడ్ జనాలు కూడా దీని గురించి గొప్పగా ట్వీట్లు చేస్తున్నారు. రెండు నిమిషాలకు కొంచెం ఎక్కువ నిడివితో ఉన్న ట్రైలర్.. ఒక క్షణం కూడా కళ్లు తిప్పుకోనివ్వలేదంటే ఆశ్చర్యం లేదు. సినిమా మీద ఇప్పటికే ఉన్న అంచనాల్ని మరింత పెంచేసింది ఈ ట్రైలర్.

కామెంట్‌లు