కొత్త లుక్ లో కనిపించనున్న మహేష్


మహేష్ బాబు తన 23 వ సినిమాని మురగదాస్ తో చేస్తున్నారు. ఆ తదుపరి సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక ఆ తర్వాత చేయనున్న 25వ సినిమాకి కూడా రంగం సిద్దం చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు గతంలో ఎన్నడు లేని విధంగా ఎన్నారై లుక్ లో సరికొత్తగా కనిపించనున్నాడట. కథ మొత్తం అమెరికా నేపధ్యంలో నడుస్తుంది కనుక సినిమా ఎక్కువ భాగం యూఎస్ లోనే షూటింగ్ జరుపుకుంటుందని కూడా తెలుస్తుంది.

మహేష్ బాబు హీరోగా పరిచయం అయిన తోలి సినిమాకి అశ్వని దత్ నిర్మాత. మహేష్ బాబు కెరీర్లోనే కీలకమైన ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేయడం విశేషం. అశ్వని దత్ తో కలసి డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొనున్నాడు. భారీ స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించే అవకాశాలుండగా హీరోయిన్, ఇతర ఇతర నటీ నటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


కామెంట్‌లు