శాత‌క‌ర్ణి పై ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్‌…షాకింగ్ కామెంట్స్‌..



యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. బాల‌య్య 100వ చిత్రం కావ‌డంతో అభిమానులు ఈ సినిమా ట్రైల‌ర్ కోసం వేయిక‌ళ్ల‌తో ఎప్పుడు వ‌స్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ట్రైల‌ర్ వ‌చ్చి రావ‌డంతోనే యూట్యూబ్‌ను షేక్ చేస్తూ దూసుకెళుతోంది. ఈ క్ర‌మంలోనే బాబాయ్ బాల‌య్య శాత‌కర్ణి ట్రైల‌ర్‌కు అంద‌రూ ఫిదా అయిపోతుండ‌గా…అబ్బాయ్ ఎన్టీఆర్ సైతం శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.

ఓ వైపు శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంటే ఎన్టీఆర్ ట్విట్ట‌ర్‌లో శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌పై స్పందించాడు. శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌లో బాల‌య్య ఇర‌గ‌దీశాడ‌ని…మ‌నం ఇంత‌కు ముందెన్న‌డు చూడ‌ని బాల‌య్య‌ను శాత‌క‌ర్ణిలో చూస్తున్నామ‌ని ఎన్టీఆర్ బాబాయ్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. ఇక డైరెక్ట‌ర్ క్రిష్‌ను పొగిడిన ఎన్టీఆర్ శాత‌క‌ర్ణిలో స‌రికొత్త బాల‌య్య‌ను ప్ర‌జెంట్ చేశాడ‌ని మెచ్చుకోవ‌డంతో పాటు ట్విట్ట‌ర్‌లో శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ లింక్ షేర్ చేశాడు.
శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌తో బాబాయ్‌ను ఓ రేంజ్‌లో పొగిడేసిన ఎన్టీఆర్ బాబాయ్‌పై త‌న‌కు ఉన్న అనంతాభిమానాన్ని మ‌రోసారి చాటుకున్నాడు. ఇటీవ‌ల ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని వ‌స్తోన్న వార్త‌ల‌ను ఎన్టీఆర్ ఈ ట్రైల‌ర్ షేరింగ్‌తో ప‌టాపంచ‌లు చేసేశాడు. ఎవ‌రేమ‌నుకున్నా తాము నంద‌మూరి వార‌సులం అని, త‌మ మ‌ధ్య చిన్న గ్యాప్‌లు టీ క‌ప్పులో తుఫాన్ లాంటివ‌ని చెప్పిన‌ట్ల‌య్యింది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. వందో చిత్రంలో బాలయ్య రాజసం ఉట్టిపడేలా ఉన్నారు. డైలాగులు అదరగొట్టారు. చిత్రంలో గ్రాఫిక్స్ చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. చిత్రంలోని నటీనటులందరూ కొత్త వారు కావడం గమనార్హం. ట్రైలర్ రిలీజ్ చేసిన గంట వ్యవధిలోనే 17,896 మంది వీక్షించారు. 10,940 మంది ట్రైలర్‌‌ను లైక్ చేశారు.


కామెంట్‌లు