నందమూరి అభిమానుల కి మిలియన్ డాలర్ల ప్రశ్న..


తారక్ మనస్సులో బాలయ్య బాబు పై ఎలాంటి మనస్పర్ధలు కానీ  విభేధాలు లేవు అని ఎప్పటికప్పుడు జూనియర్ స్ఫష్టం చేస్తుూనే ఉన్నాడు. కానీ బాలయ్య బాబు మనస్సులో ఎముందో ఎవ్వరికి తెలియడం లేదు. కనీసం తారక్ పై నోరు కూడా మెదపడం లేదు. అసలు సమస్య ఇక్కడే వస్తోంది. పైగా తారక్ ఇప్పుడు సోంత కాళ్ళ పై నిలబడి తనకంటూ ఒక బ్రాండ్ ను ఎర్పచుకున్నాడు. ఇలాంటి సమయం లో తారక్ తో కలిసి ఉండటం బాలకృష్ణ కి కూడా మంచిదే.


నిన్న సాయంత్రం  ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. అయితే ఇది జూనియర్ కళ్యాణ్ రామ్ లకు షాక్ ఇచ్చినట్లుగా ఫిలింనగర్ లో గాసిప్పులు గుప్పుమంటున్నాయి. జూనియర్ బాలయ్యల మధ్య సాన్నిహిత్యం తరిగిపోయి చాలాకాలమే అయిపోయినా జూనియర్ ఏదోవిధంగా బాలకృష్ణతో సద్దుబాటు చేసుకుందామని చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన వార్తలు ఇప్పటికే అనేక సార్లు వచ్చాయి.

లేటెస్ట్ గా ‘శాతకర్ణి’ ట్రైలర్ విడుదలైన కొద్ది సేపటికే జూనియర్ ఆ ట్రైలర్ ను ముఖ్యంగా బాలకృష్ణను ఆకాశంలోకి ఎత్తేస్తూ తన ట్విటర్ లో కామెంట్స్ చేయడంతో జూనియర్ బాలయ్యల కలయిక ఎదో ఒక సందర్భంలో బహిరంగంగా ఉంటుంది అని కలలు కన్నారు నందమూరి అభిమానులు. అయితే ఆ కలలు కూడ కల్లలుగా మారినట్లు సంకేతాలు వస్తున్నాయి.

అయితే ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం నిన్న సాయంత్రం జరుగిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ ఇన్విటేషన్ కూడ జూనియర్ కళ్యాణ్ రామ్ లకు ఇప్పటివరకు చేరలేదు అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ఫంక్షన్ బాలయ్య ఇంటి ఫంక్షన్ కాకపోయినప్పటికీ బాలకృష్ణ సన్నిహితులు చాలామందికి ‘శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ ఇన్విటేషన్స్ పంపినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఎంతోమందిని తన 100వ చిత్రం ఆడియో ఫంక్షన్ కు శ్రద్ధతో పిలిచిన బాలకృష్ణ ఈనందమూరి బ్రదర్స్ ను మళ్ళీ పక్కకు పెట్టాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పట్లో బాలయ్యా జూనియర్ ల మధ్య సయోధ్య కుదరడం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయాలలో సినిమాలలో శాశ్విత శత్రువులు అదేవిధంగా శాశ్విత మిత్రులు కలకాలం ఉండరు కాబట్టి ఎదో ఒకరోజు బాలయ్యా జూనియర్లు ఒకే వేదిక పై హడావిడి చేసే రోజులు వస్తాయని నందమూరి అభిమానులు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు..

అయితే తారక్ మనస్సులో బాలయ్య బాబు పై ఎలాంటి మనస్పర్ధలు కానీ  విభేధాలు లేవు అని ఎప్పటికప్పుడు జూనియర్ స్ఫష్టం చేస్తుూనే ఉన్నాడు. కానీ బాలయ్య బాబు మనస్సులో ఎముందో ఎవ్వరికి తెలియడం లేదు. కనీసం తారక్ పై నోరు కూడా మెదపడం లేదు. అసలు సమస్య ఇక్కడే వస్తోంది. పైగా తారక్ ఇప్పుడు సోంత కాళ్ళ పై నిలబడి తనకంటూ ఒక బ్రాండ్ ను ఎర్పచుకున్నాడు. ఇలాంటి సమయం లో తారక్ తో కలిసి ఉండటం బాలకృష్ణ కి కూడా మంచిదే. ఫంక్షన్ లో  వీరిద్దరు కలిసి ఉంటే ఆ కికే వేరు. మరి దాని కోసం  ఎన్ని రోజులు వేచి చూడాలో.


కామెంట్‌లు