ఎన్టీఆర్-బాబీ కాంబో సినిమా చకచకా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే హీరోయిన్లతోపాటు ప్రముఖ తారాగణాన్ని ఎంచుకున్న ఈ చిత్రబృందం.. ఇప్పుడు టైటిల్‌గా ఓ పేరు పెట్టాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీకి ‘నటవిశ్వరూపం’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని యూనిట్ ఆలోచిస్తోందట. ఈ మూవీ కథకి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో.. ఆ పేరే పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తన సొంత ప్రొడక్షన్ హౌస్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’పై నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ త్రిపాత్రాభినయం పోషిస్తున్నాడు. అతని సరసన కాజల్ అగర్వాల్, నివేద థామస్, అనుపమలు కథానాయికలుగా నటించనున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. వచ్చే నెలలో సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమా చిత్రీకరణని శరవేగంగా ముగించి.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి