ఎన్టీఆర్ – బాబి సినిమా హీరోయిన్ ఫిక్స్‌…


మూడు నెల‌లుగా ఊరిస్తూ వ‌స్తోన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమాపై ఎట్ట‌కేల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. ఎన్టీఆర్ – ప‌వ‌ర్ ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) కాంబోలో తెర‌కెక్కే సినిమా ఈ నెల 9న ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది.

ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు ఎన్టీఆర్‌కు బాగా క‌లిసొచ్చిన హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాలేన‌ట‌. కాజ‌ల్‌ కెరియర్ మందగించిందని అంతా అనుకుంటున్న వేళ, మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న ఆమెకు ఛాన్స్ రావ‌డంతో కెరియ‌ర్ మ‌ళ్లీ గాడిలో ప‌డింది. ఈ యేడాది ఇప్ప‌టికే ఆమె స్టార్ హీరోల‌తో చేసిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, బ్ర‌హ్మోత్స‌వం సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి.
దీంతో కాజ‌ల్ పెద్ద ఐరెన్‌లెగ్ అన్న ముద్ర ప‌డిపోయింది. ఈ టైంలో ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్‌లో స్పెష‌ల్ సాంగ్ ఆమె కేరీర్‌కు పెద్ద బూస్ట‌ప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ .. బాబీల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలోను కాజల్ కి మ‌రో ఛాన్స్ దక్కిందని స‌మాచారం.

ఎన్టీఆర్ తో ‘బృందావనం’ .. ‘టెంపర్’ సినిమాలు చేసిన కాజల్, రీసెంట్ గా ‘జనతా గ్యారేజ్’లో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. కాజల్ తో వున్న హిట్స్ కారణంగా ఆమె పేరును ఎన్టీఆర్ సూచించాడట.


కామెంట్‌లు