ఎన్టీఆర్ తో క్రిష్ సినిమా చేస్తున్నాడా?


టాలీవుడ్ పరిశ్రమలో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ కానుంది. ఎన్టీఆర్, క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకేక్కనున్నట్లు పరిశ్రమ నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా పనుల్లో బిజీగా ఉన్నా క్రిష్ తన కొత్త సినిమా స్క్రిప్ట్ లపై ద్రుష్టి పెట్టాడు. ఎన్టీఆర్ కోసం ఓ కథని సిద్దం చేశాడట. త్వరలో అయన ఆ లైన్ ఎన్టీఆర్ కి చెప్పనున్నాడని తెలిసింది. ప్రస్తుతం బాబితో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా అనుకుంటున్నారు. అయితే దీనిపై సరైన సంచారం లేదు. ఇప్పుడు క్రిష్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్దం అవుతున్నాడు. ఒక వేల లైన్ ఓకే అయితే ఇదే ఎన్టీఆర్ తదుపరి సినిమా అయ్యే అవకాశం ఉన్నది.

కామెంట్‌లు