హాట్‌ యాంకర్‌ ప్లానేంటి?


బుల్లితెర మీద ‘జబర్దస్త్‌’ ప్రోగ్రామ్‌తో సూపర్‌ పాపులర్‌ అయిపోయింది యాంకర్‌ అనసూయ. మిగిలిన హాట్‌ యాంకర్లతో పోలిస్తే అనసూయ కాస్త వెరైటీ. ప్రస్తుతం ఆమె 30ల్లో ఉంది. పైగా ఇద్దరి పిల్లల తల్లి. అయినా గ్లామర్‌ విషయంలో ఎలాంటి హద్దులూ పెట్టుకోదు.

అదే ఆమెకు సినిమా అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది ఆమె నటిచించిన రెండు సినిమాలు (సొగ్గాడే చిన్నినాయన, క్షణం) సూపర్‌హిట్‌లుగా నిలిచాయి. అయినా ఆమె వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పేసుకోకుండా ఆచితూచి అడగులేస్తోంది. ఇటీవల మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌ ‘విన్నర్‌’ సినిమాలో ఓ ఐటెం పాట చేసింది. ‘క్షణం’కు, ‘విన్నర్‌’కు మధ్య వచ్చిన గ్యాప్‌లో ఈ అమ్మడు పూర్తిగా గ్లామర్‌ మీద దృష్టిపెట్టిందట. కష్టమైన వర్కవట్లు చేసి సూపర్‌ ఫిజిక్‌ సాధించిందట. తాజాగా అనసూయ ఓ ఫోటో సెషన్‌లో పాల్గొంది. వైట్‌ టాప్‌, బ్లాక్‌ బాటమ్‌తో అందర్నీ అకట్టుకుంటోంది. ఇప్పటికీ బుల్లితెరను పూర్తిగా వదలని అనసూయ వచ్చే ఏడాది మరిన్ని సినిమా అవకాశాలు అందుకోవాలనే ఆలోచనలో ఉంది.


కామెంట్‌లు