నందమూరి ఫ్యామిలీ హీరోలు అయిన బాబాయ్-అబ్బాయ్ మధ్య వాతావరణం ఇంకా హాట్ హాట్‌గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ – కళ్యాణ్‌రామ్ దగ్గరుండి ఏర్పాట్లు చేసిన జానకీరామ్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌కు బాలయ్య డుమ్మా కొట్టేశారు. ఇక బాలయ్య 100వ సినిమా శాతకర్ణి ఆడియో ఫంక్షన్‌కు ఎన్టీఆర్-కళ్యాణ్‌రామ్ బ్రదర్స్‌కు ఆహ్వానమే అందలేదని వార్తలు వచ్చాయి.
ఈ ఇద్దరి మధ్యా గ్యాప్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ మాత్రం బాబాయ్‌తో కలిసేందుకు ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి ట్రయిలర్ ను యంగ్ టైగర్ మెచ్చుకున్నాడు. హాలీవుడ్ రేంజ్‌లో ట్రయిలర్ ఉందని ట్వీట్ చేశాడు. మొన్న విడుదలైన సాాంగ్స్ కూడా బాగున్నాయంటున్నాడు. ఇక కళ్యాణ్‌రామ్ సైతం శాతకర్ణి ట్రైలర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ శాతకర్ణికి టాప్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారతాడన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ ఇప్పుడు బిజీగా ఏం లేడు. కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి ఇంకాస్త టైం ఉంది. సో… బాలయ్య అడిగినా అడగకపోయినా… శాతకర్ణి సినిమా రిలీజ్‌కు ముందు…రిలీజ్ తర్వాత కూడా ఎన్టీఆర్ ఆ సినిమాపై ట్వీట్లు పెడుతూ బ్రాండ్ అంబాసిడర్‌గా తన వంతుగా ప్రమోట్ చేస్తాడన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.
ఎన్టీఆర్ ఇటీవలే తన సోదరుడు కళ్యాణ్‌రామ్ నటించిన ఇజం సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేశాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌కు కూడా హాజరయ్యాడు. సో… ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని.. శాతకర్ణి సినిమాను కూడా ఎన్టీఆర్ తన వంతుగా ప్రమోట్ చేయడం ఖాయంగా కనపడుతోంది. మరి ఎన్టీఆర్ ప్రమోషన్‌ను బాలయ్య పట్టించుకుంటాడో ? లేదో ? చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి