‘శాతకర్ణి’ మరో సంచలన రికార్డ్


బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైనప్పటి నుంచి ఊహించని రికార్డులు సృష్టిస్తోంది. కేవలం నాలుగున్నర గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సంపాదించిన ఈ ట్రైలర్.. ఆ తర్వాత 2, 3 మిలియన్ల మార్క్స్‌ని తక్కువ టైంలోనే క్రాస్ చేసి పడేసింది. ఇప్పుడు మరో మైలురాయిని ఈ ట్రైలర్ అందుకుంది. కేవలం 75 గంటల్లోపే 4 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టుకుంది. అంత ఎక్కువ టైంలో అన్ని ఎక్కువ వ్యూస్ రాబట్టిన తొలి తెలుగు ట్రైలర్ ఇదే. అంతేకాదు.. 70 వేలకుపైగా లైక్స్ రాబట్టుకుని, ఆ విషయంలోనూ ఇదే టాప్‌లో ఉంది.

క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నిజజీవితం ఆధారంగా రూపొందుతుండడంతో దీనిపై మొదటినుంచే భారీ అంచనాలు నెలకొనడం, అతి తక్కువ టైంలోనీ షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ట్రైలర్‌ని కళ్ళుచెదిరే గ్రాఫిక్స్‌తోపాటు వార్ సీన్లు అదిరిపోవడంతో.. దీనికి దేశవ్యాప్తంగా ఈ రేంజులో రెస్పాన్స్ వస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇంకా ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండడాన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే 5 మిలియన్ల మార్క్‌ని క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి.. ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు దర్శకుడు క్రిష్.

కాగా.. ఈ మూవీ ఆడియో వేడుక ఈ నెల 26వ తేదీన గ్రాండ్‌గా నిర్వహించేందుకు యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం విస్తృతస్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


కామెంట్‌లు