ఎన్టీఆర్ రికార్డును అందుకోలేకపోయిన చిరంజీవి

మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్150 టాలీవుడ్ హిస్టరీలో ఏ రికార్డును వదిలిపెట్టకుండా అన్ని రికార్డులను వేటాడి వెంటాడి బ్రేక్ చేస్తూ నయా హిస్టరీ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది…ఇంత క్రేజ్ లో కూడా ఓ రికార్డును అందుకోలేకపోయింది ఖైదీ నంబర్150.

అదేంటంటే పక్క రాష్ట్రం నైజాంలో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ షేర్ రికార్డును యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో 19.65 కోట్లతో నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పాడు…కాగా ఖైదీ ఇప్పటివరకు అక్కడ కేవలం 16.40 కోట్ల దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే జనతాగ్యారేజ్ టికెట్ రేటు 100 నే పెట్టగా ఖైదీకి 150 నుండి టికెట్ రేటు స్టార్ట్ అయింది…అది 250 కొన్ని చోట్ల 300 ని కూడా పాకింది.

కొత్త సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేపద్యంలో నైజాంలో జనతాగ్యారేజ్ ని ఇంకా క్రాస్ చేయలేదు….కొన్ని లక్షల తేడానే ఉండటంతో అది సాధ్యం అవుతుందా లేదా అన్న ఉత్కంట కంటిన్యూ అవుతుంది.

కామెంట్‌లు