దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి సాధించిన షాకింగ్ విజయంతో ఇప్పుడు అందరూ బాహుబలి-2 కోసం వెయిట్ చేస్తున్నారు. బాహుబలి రూ.600 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పుడు బాహుబలి 2 ప్రి రిలీజ్ బిజినెస్ అన్ని ఏరియాల్లోను ఠారెత్తుతోంది.
ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా బాహుబలి -2 ప్రి రిలీజ్ బిజినెస్ రూ.600 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఇక ఏపీ, తెలంగాణలో బాహుబలి -2 రూ.130 కోట్ల బిజినెస్ చేసింది. ఓ ప్రాంతీయ సినిమా ఓ రాష్ట్రంలో ఈ రేంజ్‌లో బిజినెస్ చేయడం ఆల్ ఇండియా రికార్డుగా నిలిచింది.
బాహుబలి ది బిగినింగ్ ఏపీ+తెలంగాణలో రూ.66 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసి రూ.110 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమా సాధించిన వసూళ్ల కంటే మరో రూ.20 కోట్ల బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలతో పాటు సినీ అభిమానులకు సైతం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
బాహుబలి -2 ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ :
నైజాం – 47.5 కోట్లు
సీడెడ్ – 25 కోట్లు
ఉత్తరాంధ్ర + కృష్ణా – 23 కోట్లు
గుంటూరు – 11.5 కోట్లు
ఈస్ట్ + వెస్ట్ – 17.50 కోట్లు
నెల్లూరు – 5.50 కోట్లు
——————————————
టోటల్ ఏపీ+తెలంగాణ = 130 కోట్లు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి