మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్ల విషయంలో మెగా క్యాంప్ చాలా శ్రద్ధ తీసుకుంది. తొలి రోజు నుంచే చిరు బావమరిది, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్‌మీట్లు మీద ప్రెస్‌మీట్లు పెట్టి కలెక్షన్ల గురించి చెప్పారు.
ఖైదీ నెంబర్ 150 రూ.100 కలెక్షన్లు సాధించిందని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే ఈ చిత్ర నిర్మాత రాంచరణ్ మాత్రం ఈ సినిమా ఫుల్ రన్‌లో కేవలం రూ.75 కోట్ల కలెక్షన్లను సాధించినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందించిన రిటర్న్స్‌లో చెర్రీ పేర్కొన్నాడట. చిరంజీవి పారితోషికం రూ.20 కోట్లు, డైరెక్టర్ వినాయక్ పారితోషికం రూ.10 కోట్లు సహా.. సినిమాకు రూ.60 కోట్లు ఖర్చు పెట్టామని, రూ.15 కోట్లను లాభాలుగా ఆర్జించామని ఐటీ అధికారులకు చెర్రీ వెల్లడించాడని టాక్.
అల్లు అరవింద్‌తో పాటు డైరెక్టర్ వివి.వినాయక్ ఇద్దరూ కూడా సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు ప్రెస్‌మీట్ల మీద ప్రెస్‌మీట్లు పెట్టి మరీ చెప్పారు. మొత్తంగా ఫుల్ రన్‌లో రూ.105 కోట్లను సాధించినట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు చెర్రీ అల్లు అరవింద్ లెక్కలకు భిన్నంగా చెప్పడంతో అల్లు అరవింద్ లెక్కలన్నీ బోగస్సేనా ? అన్న డౌట్లు వస్తున్నాయి. ఖైదీకి పోటీగా శాతకర్ణి సినిమా ఉండడంతో ఖైదీకి బాగా హైప్ తీసుకొచ్చేందుకే అరవింద్ ఈ రాంగ్ ఫిగర్స్ చూపించారా ? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరి అసలు నిజాలేంటో చెర్రీ, అరవింద్‌కే తెలియాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి