ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ 28 ఫిక్స్‌


టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ టెంప‌ర్ – నాన్న‌కుప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌తో కేరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే గ్యారేజ్ త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల డైరెక్ట‌ర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సెప్టెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా చేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు.
అయితే పవన్‌తో త్రివిక్ర‌మ్ ఓ పొలిటిక‌ల్ బేస్‌డ్ స్టోరీతో సినిమా తెర‌కెక్కించేందుకు ప్లాన్లు వేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తాడు. ఇక జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత స‌రైన ప్లానింగ్ లేక‌పోవ‌డంతో చాలా రోజుల పాటు ఖాళీగా ఉన్న ఎన్టీఆర్ ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు ప్లానింగ్‌తో ఉన్నాడు.
ప్ర‌స్తుతం బాబి డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్ న‌టిస్తోన్న సినిమా 27వ సినిమా కాగా…ఇక త‌న 28వ సినిమాను టాలీవుడ్ స్టార్ అండ్ మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడ‌ట‌. త‌న నెక్ట్స్ సినిమాను ఎన్టీఆర్ వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో చేయ‌డం దాదాపు ఖ‌రారైనట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వినాయ‌క్ ఎన్టీఆర్ సినిమా కోసం క‌థ‌ను డ‌వ‌ల‌ప్ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డికానున్నాయి.

కామెంట్‌లు