ఎన్టీఆర్ ను టార్గెట్ చేసుకున్నా నేషనల్ మీడియా..


టైగర్ టైగర్ టైగర్ ఎవరు ఈ టైగర్ అంటూ ప్రస్తుతం సౌత్ మొత్తంతో పాటు నార్త్ లో ఉన్నవాళ్ళు కూడా యంగ్ టైగర్ గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. దీనికంతటికీ కారణ౦ జనతాగ్యారేజ్ సినిమా సృష్టించినా కలెక్షన్స్ సునామీ,ట్వీటర్లో గత సంవత్సరం ట్రెండింగ్ గా నిలవడం,ఇక ఇండియా లో టాప్ డ్యాన్సర్ గా నిలవడం అని చెప్పొచ్చు. ఇప్పుడు చేయబోతున్న 27 సినిమాలో నటిస్తున్న హేమాహేమీలు-టాప్ క్లాస్ టెక్నీషియన్స్ కావొచ్చు ఈ టైగర్ ఎవరు అంటూ తెగ ఆరాలు తీయడం మొదలుపెట్టారు అందరూ.

జనతాగ్యారేజ్ హ్యూమ౦గస్ సక్సెస్ తర్వాత ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో హాలివుడ్ అండ్ బాలీవుడ్ ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై టోటల్ బాలీవుడ్ నుండి సౌత్ వరకు అన్ని ఇండస్ట్రీలు షాక్ అవుతున్నాయి.

అసలు ఆ ప్రాజెక్ట్ లో ఏముంది ఎందుకు ఇంత క్రేజ్ అంటూ ఈ టైగర్ గురించి ఆరాలు తీస్తున్నారట బాలీవుడ్ లో ఈ సినిమాకు క్రేజ్ కూడా మొదలు అవ్వడంతో కచ్చితంగా అక్కడ డబ్ అయ్యి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక కోలివుడ్ లోనూ క్రేజ్ ఉండటంతో అక్కడ నుండి కూడా సూపర్ ఆఫర్స్ వస్తున్నాయి. అవి సినిమా తెలుగు వెర్షన్ లోనే అక్కడ సంచలనం సృష్టించడంతో ఇక మీదట ఎన్టీఆర్ చేసే సినిమాలు ఒకేసారి డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇలా అన్ని చోట్ల .టైగర్ టైగర్ అంటూ ఎన్టీఆర్ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు యూ  ట్యూబ్ లో కూడా దమ్ము సినిమా కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ఇక అలాగే సెట్స్ మ్యాక్స్ లో కూడా ఎన్టీఆర్ సినిమా మంచి టీఆర్ పి రేటింగ్ ఉంది..అందుకే నేషనల్ మీడియా కూడా తారక్ తో ఒక ఇంటర్వూ చేయాలనుకుంటోందట..ఎన్టీఆర్ ఈ సంవత్సరం గూగుల్ ఎక్కవ సెర్చ్ లో నెం 1 నిలిచినా సంగతీ తెలిసిందే. ఇక అలాగే నేషనల్ లెవల్లో ట్వీటర్లో 20 వ స్ధానం లో ఉన్నా సంగతీ తెలిసిందే..


కామెంట్‌లు