‘కాటమరాయుడు’ సత్తా ఏంటో టీజర్ తో తెలిసొచ్చింది. ఇటీవలే రిలీజైన పవన్ ‘కాటమరాయుడు’ టీజర్ రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకొంది. అన్నయ్య ‘ఖైదీ నెం.150’ రికార్డ్ ని బద్దలు కొట్టేసింది. దీంతో.. కాటమరాయుడు అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడంతా ఉగాధికి రానున్న కాటమరాయుడు కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే, ఇప్పుడు ‘కాటమరాయుడు’ టైటిల్ సాంగ్ అంటూ.. ఓ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పవన్ వ్యక్తిత్వం ప్రతిభింబించేలా
వెస్ట్రన్ బీట్స్ తో సాంగ్ ని రూపొందించారు. అసలు ఇది సినిమాలోనిదేనా.. ? లేక పవన్ అభిమానుల క్రియేటివిటీనా.. ?? అన్న విషయంలో క్లారిటీ లేదు. బహుశా.. ఇది పవన్ అభిమానుల పైత్యం అయివుంటుందని చెప్పుకొంటున్నారు.
డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాటమరాయుడు’లో పవన్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో పవన్ ఫ్యాక్షనిస్ట్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. శరత్ మరార్ నిర్మాత. ఈ చిత్రం ఉగాధి కానుకగా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి